కెనడా భారత్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే లా ఉంది. నిజ్జర్ హత్య విషయంలో రెండు దేశాలు పట్టు వీడడం లేదు. ముందుగా కెనడా దేశం భారత రాయబారిని బహిష్కరించడంతో భారత్ కూడా కెనడాదేశ రాయబారిని బహిష్కరించింది. దీంతో వివాదం తారా స్థాయికి చేరింది. ఈ క్రమంలో భారత్ అప్రమత్తమైంది. కెనడాలో ఉంటున్న భారతీయులు జాగ్రత్త ఉండాలని భారత విదేశాంగా శాఖ హెచ్చరించింది. ఇరు దేశాలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కెనడాలోని భారతీయులు ప్రయాణం చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. కెనడాలో చదువుకుంటున్న విద్యార్థులు ఒట్టావాలోని హై కమిషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ కావాలని లేకుంటే టొర్నటోలోని కాన్సులేట్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. దీని ద్వారా అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సవిూక్షించగలమని పేర్కొన్నారు. భారత్‌పై విషం చిమ్ముతున్న ఉగ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేసింది. భారతీయులపై హింసకు పాల్పడడం అంటే అది యూఎన్ ఛార్టర్‌ని ఉల్లంఘించినట్టే అవుతుందని హెచ్చరించింది. కెనడా ప్రధాని ఇప్పటికే ఈ వివాదంపై అమెరికా సాయం కోరారు. అమెరికా మాత్రం ఇంకా స్పందించలేదు.
చదవండి ఇవి కూడా