Ioc” అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 10వ అధ్యక్షురాలిగా ‘క్రిస్టీ కోవెంట్రీ’ ఎన్నికయ్యారు. 131 ఏళ్ల ఐఓసీ చరిత్రలో తొలిసారిగా ఈ పదవి చేపట్టిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఈమె జింబాబ్వే క్రీడామంత్రి, మరియు మాజీ ఒలింపిక్ బంగారు పతక విజేత.
కోవెంట్రీని ‘జింబాబ్వే గోల్డెన్ గర్ల్స్‌గా ఆమె సొంతదేశంలో అభిమానులంతా పిలుచుకుంటారు.
ఒలింపిక్స్లో లో సెమీ ఫైనలు చేరుకున్న తొలి జింబాబ్వే స్విమ్మర్గా, ‘స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్’ గా నిలిచారు. అథ్లెటిక్ క్రీడా రంగంలో కోవెంట్రీ సాధించిన మైలురాళ్లెన్నో.
ఏడు ఒలింపిక్ పతకాల విజేత.. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణపతకంతో పాటు మూడు రజత పతకాలు గెలుచుకుంది.
ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి ఆఫ్రికన్ గా, 41 ఏళ్ల వయ సులో ఈ పదవిని చేపట్టిన అతి పిన్నవయస్కురాలిగా కోవెంట్రీ రికార్డు సాధించారు.
కోవెంట్రీ ఐదు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న తర్వాత, 2016లో ప్రొఫెషనల్ క్రీడల నుంచి విరమణ పొందారు. 2013 నుంచి ఐఓసీ సభ్యురాలిగా ఉంటూ, బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు.