Current Affairs” లా కమిషన్‌ ఛైర్మన్ గా జస్టిస్‌ దినేశ్‌ బాధ్యతల స్వీకరణ.. క‌రెంట్ అఫైర్స్

Current Affairs”  23వ లా కవిూషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు- న్యాయవాది హితేశ్‌ జైన్‌, ప్రొఫెసర్‌ డీపీ వర్మ.. కవిూషన్‌లో సభ్యులుగా నియమితులయ్యారు.
ఏప్రిల్‌ 15, 2025 నాడు వాళ్లు ఛార్జ్‌ తీసుకున్నారు. ఆగస్టు 31, 2027న వాళ్ల పదవీ కాలం పూర్తి అవుతుంది.
రాజస్థాన్‌లో సుమారు రెండు దశాబ్ధాల పాటు- లాయర్‌గా జస్టిస్‌ మహేశ్వరి ప్రాక్టీసు చేశారు. ఆ తర్వాత 2004లో ఆయన రాజస్థాన్‌ హైకోర్టు బెంచ్‌కు పదోన్నత పొందారు.
అలహాబాద్‌ హైకోర్టులో జడ్జిగా చేశారు. మేఘాలయా హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా, కర్నాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా కూడా చేశారు. 2019 జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదోన్నతి పొందారు. 2023 మేలో
రిటైర్‌ అయ్యే వరకు ఆయన సుప్రీంకోర్టులో జడ్జిగా చేశారు.
దేశ చట్టాలపై ఎప్పటికప్పుడు సవిూక్ష చేస్తుంది. సవరించాల్సిన చట్టాలను, రద్దు చేయాల్సిన చట్టాల గురించి లా కవిూషన్‌ తన నిర్ణయాలను వెల్లడిస్తుంటు-ంది. న్యాయం అందరికి అందే రీతిలో, న్యాయ విభాగంలో పరిపాలన సక్రమంగా సాగే రీతిలో లా కవిూషన్‌ వ్యవహరిస్తుంది.

Degree Admissions” బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. కోర్సులు, కాలేజీల వివ‌రాలు..

TG TET” టెట్ అప్లికేష‌న్ ప్రారంభం.. అప్ల‌య్ చేయండి ఇలా..

Degree Admissions” బీసీ గురుకులాల్లో డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. కోర్సులు, కాలేజీల వివ‌రాలు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *