కరీంనగర్ జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్: జులై 28న ప్రత్యేక ఎంప్లాయ్‌మెంట్ కార్డు, రిజిస్టేష‌న్ మేళా .. కావాల్సిన సర్టిఫికేట్లు ఇవే!

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ ఉపాధి కల్పనా శాఖ తీపి కబురు అందించింది. జిల్లాలోని స్థానిక నిరుద్యోగుల సౌకర్యార్థం ఈ నెల 28వ తేదీన (28.07.2026) జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ప్రత్యేక “ఉపాధి నమోదు మేళా” (New Employment Registration Mela) నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి తెలిపారు.

కొత్తగా ఎంప్లాయ్‌మెంట్ కార్డు పొందాలనుకునే అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

📍 మేళా పూర్తి వివరాలు:
తేదీ: 28 జులై 2026

సమయం: ఉదయం 10:00 గంటల నుండి

వేదిక: జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం (District Employment Office), ఫైర్ స్టేషన్ దగ్గర, గవర్నమెంట్ ఈ-సేవ సెంటర్ పైన (ఫస్ట్ ఫ్లోర్), కాశ్మీర్‌గడ్డ, కరీంనగర్.

📄 కావాల్సిన ధృవీకరణ పత్రాలు (Required Documents):
ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలనుకునే అభ్యర్థులు క్రింది పేర్కొన్న ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు వాటి జిరాక్స్ ప్రతులను (Photocopies) కూడా వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది:

ఆధార్ కార్డ్ (Aadhaar Card)

1వ తరగతి నుండి 7వ తరగతి వరకు అధ్యయన ధృవీకరణ పత్రాలు (Study Certificates – 1st to 7th Class)

కుల ధృవీకరణ పత్రం (Caste Certificate)

పదో తరగతి మార్కుల మేమో (SSC Marks Memo)

ఇతర ఉన్నత విద్యా అర్హతల సర్టిఫికేట్లు (ఏవైనా ఉంటే)

ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫోన్ నంబర్ & ఈ-మెయిల్ ఐడీ (Mobile Number & Email ID)

కరీంనగర్ జిల్లా స్థానికత కలిగి, అర్హత ఉన్న నిరుద్యోగులందరూ నేరుగా హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా

ఉపాధి కల్పనా అధికారి ప్రకటనలో పేర్కొన్నారు.

చిగురుమామిడి, సైదాపూర్ మండ‌లాల్లో “జ‌ల‌సిరి”

నెలకు రూ. 20,000 అదనపు ఆదాయం: ఉద్యోగం చేస్తూనే పార్ట్‌టైమ్‌గా డబ్బు సంపాదించే 5 ఉత్తమ మార్గాలు!

రూ. 30,000 లోపు టాప్ AI స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు, బ్యాటరీ వివరాలు ఇక్కడ చూడండి!