Karimnagar news” మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూర్‌లో హాస్టల్ సందర్శన కార్యక్రమంలో భాగంగా సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సుడా చైర్మెన్ మాట్లాడారు. గురుకులాల్లో, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. గురుకులాల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందించడానికి విద్యా ప్రమాణాలను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని వివరించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.