Karimnagar to Mumbai Train” ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బొంబాయికి వలసెల్లినవారు చాలా మందే ఉంటారు. ఈ ప్రాంతం నుంచి బొంబాయి వెళ్లే వారు ఎక్కువగా బస్సు ప్రయాణం మీదే ఆధారపడుతారు. అయితే వేసవి సెలవుల్లో ఎక్కువగా రాకపోకల దృష్ట్యా రైల్వే అధికారులు బొంబాయి నుంచి (Karimnagar to Mumbai Train)కరీంనగర్ కు వారానికో ప్రత్యేక రైలును నడిపేందుకు నిర్ణయించారు. ప్రతి మంగళవారం మధ్యాహ్నం
3.30 గంటలకు ముంబై నుంచి బయలు దేరి బుధవారం ఉదయం 8.30 కరీంనగర్ చేరుకుంటుంది. ఈ రైలు నెంబర్ 01067. మళ్లీ (Karimnagar to Mumbai Train) కరీంనగర్ నుంచి ముంబైకి ప్రతి బుధవారం రాత్రి 7.05గంటలకు ప్రయాణం ప్రారంభం మవుతుంది. మరుసటి రోజు (గురువారం) మధ్యాహ్నం 1.40 గంటలకు ముంబై రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. దీని నెంబర్ 01068. మే 28 వరకు మాత్రమే ఈ రైలును నడపునున్నట్టు అధికారులు తెలిపారు. (Karimnagar to Mumbai Train) కరీంనగర్ పోను 8 ట్రిప్పులు. ముంబై నుంచి రాను 8 ట్రిప్పులు మాత్రేమే నడిపించనున్నారు. ఆ తరువాత నడింపించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
జగిత్యాల వాసులకు నిరాశే..
……………………………………….
ఈ రైలు మెట్‌పల్లి, కోరుట్ల లాంటి చిన్న పట్టణాల్లో హాల్టింగ్ ఇచ్చి
జగిత్యాల జిల్లా కేంద్రంలో మాత్రం హాల్టింగ్ ఇవ్వలేదు. దీనిపై
జగిత్యాల వాసుల నిరాశ చెందుతున్నారు. జగిత్యాల నుంచి ముంబాయి
లో సెటిల్ అయినవారు ఎక్కువగా ఉన్నారు. జగిత్యాల(లింగంపేట)లోనూ
హాల్టింగ్ ఇవ్వాలని వారు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
Pm Modi” తెలుగులో శుభాకాంక్షలు చెప్పిన మోడి
Crow Viral Video” కాకి చెప్పిన నీళ్ల కథ.. పాతదే కానీ కొత్తగా మళ్లా… వీడియో వైరల్
Dog,Tiger,Lion” పులి, సింహం, కుక్క కొట్లాడుకున్నాయి.. వీడియో వైరల్