Molangur” నాలుగు నెలల నుండి డబ్బుల కోసం ఎదురుచూపు…
కంపెనీ నిరంకుశ వైఖరికి నిరసన…
అగ్రిమెంట్ ప్రకారం చెల్లించాలి…
రైతుల , సీడ్ ఆర్గనైజర్ల డిమాండ్…
శంకరపట్నం :డిసీ ప్రతినిధి:
ఒప్పందం ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు సీడ్, ఆర్గనైజర్లు, డిమాండ్ చేస్తూ మొలంగూర్ కావేరి సీడ్ కంపెనీ ఎదుట రైతులు, సీడ్ ఆర్గనైజర్లు సోమవారంభారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు సీడ్ ఆర్గనైజర్లు మాట్లాడారు. కావేరి సీడ్ కంపెనీ యజమాన్యం రైతులకు సీడ్ ఆర్గనైజర్ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ ,ఉమ్మడి వరంగల్ ,జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో వరి పంట సీడ్ విత్తనాలు సప్లై చేసి రైతుల నుండి సేకరిస్తుందని తెలిపారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగుచేసిన రైతులకు, అగ్రిమెంట్ ప్రకారం రైతులకు కావేరి సీడ్ కంపెనీ డబ్బులు చెల్లిస్తుందని పండిన పంటను దిగుమతి చేసుకున్న కంపెనీ యజమాన్యం నాలుగు నెలల నుండి డబ్బులు ఇవ్వకుండా రైతులను సీడు ఆర్గనైజర్ లను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ నిర్వాహకులు ఫోన్ ద్వారా మాట్లాడుతూ సమయం కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. సమయం నాలుగు నెలలు ఇచ్చామని, రైతులకు డబ్బులు చెల్లించే వరకు నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందిన ఆర్గనైజర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

️ మీ బెడ్‌రూమ్‌కి కొత్త అందం!
✨ 100% Pure Cotton Bedsheet – King Size
108 x 108 Inches | 186 TC
డబుల్ బెడ్‌కి పరిపూర్ణంగా సరిపడే పరుపుపరిచి
నాణ్యమైన మెత్తటి కాటన్, స్టైలిష్ Trellis డిజైన్
️ 2 పిల్లో కవర్స్‌తో కలిపి వస్తుంది!
Haus & Kinder Classic Trellis Bedsheet
సౌకర్యం + స్టైల్ ఒకేలా కావాలంటే ఇదే బెస్ట్ ఛాయిస్!
మీ ఇంటికి.. గిఫ్ట్‌గా కూడా బెస్ట్!
లింక్ పై క్లిక్ చేసి https://amzn.to/3HC5aB8 అమెజాన్‌లో కొనుగోలు చేయండి..
