Kcr Annadata Tour” బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎండిన పొలాలను పరిశీలించేందుకు ఆదివారం వెళ్లనున్నారు. ఆదివారం (మార్చి 31) పొద్దుగాల 8:30 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి నుంచి అన్నదాతల సమస్యల తెలుసుకునేందుకు వెళ్లనున్నారు. ఎర్రవల్లి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. ఉదయం 10:30 గంటలకు జనగామ జిల్లా ధరావత్ తండాకు చేరుకుంటారు. ఆగ్రామంలో ఎండిన పొలాలను పరిశీలిస్తరు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట రూరల్, అర్వపల్లి, తుంగతుర్తి మండలాల్లో 11:30గంటలకు పర్యటించి రైతులతో మాట్లాడనున్నారు. ఆ తరువాత సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయల్దేరి.. 1:30కు సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. క్యాంపు ఆఫీసులో మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నల్గొండ జిల్లాలోని నిడమనూరు మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి ఎర్రవెల్లికి బయల్దేరతారు.
కరువు రైతుకు బాసటగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగు నీరు అందక ఎండిపోతున్న పంటపొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కరువుకు అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నింపేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.
ఇందులో భాగంగా రేపు… pic.twitter.com/ruRgrwNOzi
— BRS Party (@BRSparty) March 30, 2024
ఇవి కూడా చదవండి
Tiger Viral Video” ఏనుగు చూసి దాక్కున్న పులి.. వీడియో వైరల్
Francis Scott Key Bridge” ఓడ ఢీకొట్టడంతో కూలిపోయిన అతిపెద్ద బ్రిడ్జి.. వీడియో రికార్డు
Horse Viral Video” అరెరె.. గ్లాస్ డోర్ ను ఎగిరితంతూ పగలగొట్టిన గుర్రం.. వీడియో వైరల్