Outer Ring Road Accident” ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

Outer Ring Road Accident

Outer Ring Road Accident” ఆదివారం తెల్ల‌వారు జామున రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వ‌స్తున్న ఓ కారు హిమాయ‌త్ సాగ‌ర్  (Himayath Sagar) వ‌ద్ద‌కు రాగానే డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ఉన్న ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌రో ముగ్గురికి గాయాల‌య్యాయి. ప్ర‌మాదంలో (Car) కారు నుజ్జు నుజ్జ‌య్యింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థ‌లానికి చేరుకుని స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖానాకు త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను ఉస్మానియాకు త‌ర‌లించారు. అక్క‌డ ట్రాఫిక్ జామ్ కావ‌డంతో క్లియ‌ర్ చేశారు. కారులో అంద‌రూ యువ‌కులే ఉన్నారు. మృతి చెందిన వారిని గౌతమ్‌, ఆనంద్‌గా గుర్తించారు. మృతిచెందిన వారి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Ap inter topper” బాల్య వివాహాన్ని ఎదిరించి.. ఇప్పుడు టాపర్‌గా నిలిచిన బాలిక

Ys Sharmila”మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం… వైఎస్ ష‌ర్మిల

Lion Viral Video” సింహాల‌ను బెదిరించిన ముంగీస‌.. వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *