Amazon Prime” జూలై 18 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ‘కుబేర’

Amazon Prime”  ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన తాజా చిత్రం ‘కుబేర’, జూలై 18వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముఖ్యపాత్రల్లో నటించారు.

ఇప్పటికే సినిమా ఓటీటీ రిలీజ్‌పై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, అమెజాన్ తాజాగా విడుదల చేసిన అధికారిక పోస్టర్‌తో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

కథాంశం ఏమిటంటే…

ఒక అతిసంపన్న పారిశ్రామికవేత్త నీరజ్ మిత్ర (పాత్రలో జిమ్ సర్బ్), ప్రపంచంలోని అగ్రధనవంతుడిగా నిలవాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో ప్రభుత్వ ప్రాజెక్ట్‌ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాడు. దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన డీల్‌ కుదుర్చుకుని, దానిలో సగం బ్లాక్ మనీగా, మిగతా భాగాన్ని వైట్ మనీగా చెలామణి చేయాలనే యోచనలో ఉంటాడు.

ఈ సుదీర్ఘ, సంక్లిష్టమైన మిషన్‌ను అమలు చేయడానికి అతను జైల్లో ఉన్న మాజీ సీబీఐ అధికారి దీపక్ తేజ్ (నాగార్జున)ను విడుదల చేయిస్తాడు. దీపక్, ఈ పనికి కొందరు బిచ్చగాళ్లను ఎంచుకుంటాడు. కానీ డీల్ పూర్తయ్యాక వారిని తొలగించాలని నీరజ్ ప్లాన్ వేస్తాడు. అయితే వారిలో ఒకరైన దేవా (ధనుష్‌) ఆ కుట్ర నుంచి తప్పించుకుంటాడు.

ఇక్కడి నుంచి కథ కొత్త మలుపులు తిరుగుతుంది – దేవా ఏం చేశాడు? అతను పట్టుబడ్డాడా? డబ్బుతో ఏం జరిగింది? అన్నది చిత్రానికి మిగిలిన ఉత్కంఠభరిత భాగం.

విమర్శకుల స్పందన & ప్రేక్షకుల ఆసక్తి

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం వలన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఓటీటీ వేదికపై ఈ కథకు కొత్త ఊపొస్తుందా అన్నదే చూడాల్సిన విషయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *