Cooperative bank” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
రైతులు సహకార సంఘాల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని, ఈ బ్యాంకులలో కార్పొరేట్ బ్యాంకుల తరహా సేవలు అందుబాటులో ఉన్నాయని కేశవపట్నం కేడీసీసీ బ్యాంక్ మేనేజర్ గౌతమి తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ సహకార వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాఫ్‌కాబ్ చైర్మన్ మరియు కేడీసీసీ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడు కొండూరి రవీందర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని, కేశవపట్నంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
మేనేజర్ గౌతమి మాట్లాడుతూ, “సహకార బ్యాంకులు ఇప్పుడు మోడరన్ కార్పొరేట్ బ్యాంకులకు పోటీగా సేవలు అందిస్తున్నాయి. రైతులు, గ్రామీణ ప్రజలు వీటి సేవలు వినియోగించుకోవాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్లు షేక్ మొయినొద్దీన్, విజేందర్ నాథ్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
