Local News” ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలు…

Local News” శంకరపట్నం డిసీ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన వేడుకలను ఎన్ ఎస్ యు ఐ నాయకుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ మండల మాజీ అధ్యక్షులు అయాన్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, కేశవపట్నంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమం శాఖ మంత్రి కరీంనగర్ ముద్దుబిడ్డ, పొన్నం ప్రభాకర్ గౌడ్ జన్మదిన పురస్కరించుకొని, మొక్కలను నాటి కేక్ కట్ చేసినట్లు అయాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యు ఐ మాజీ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఇమ్రాన్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *