Local news” బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా నామినేషన్ పత్రం అందించిన శ్రావణ్ కుమార్…

Local news”  శంకరపట్నం డిసీ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ అనుబంధం బీసీ సెల్ మండల అధ్యక్ష‌ప‌ద‌వికి బొంగోని శ్రావణ్ కుమార్ నామినేషన్ వేసినట్లు ఆయ‌న మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. జాతీయ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ బీసీ సెల్ మండల అధ్యక్ష‌ప‌ద‌వికి నామినేష‌న్ వేశాన‌న‌న్నారు. శంకరపట్నం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని అందజేసినట్లు శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బండారు తిరుపతి, కేశవపట్నం గ్రామ శాఖ అధ్యక్షులు మొలంగూరి సదానందం, యువజన కాంగ్రెస్ నాయకులు ఇస్సాముద్దీన్, జిల్లా నాయకులు గోడిశాల ప్రవీణ్ గౌడ్ యువజన కాంగ్రెస్ మానకొండూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు మహమ్మద్ షారుక్, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *