Manchu Vishnu” తన ఇంట్లోని జనరేటర్‌లో మంచు విష్ణు చక్కెర పోశాడని అందుకే కరెంట్ ఆగిపోయిందని మంచు మనోజ్ కొన్ని రోజుల క్రితం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాను, తన భార్య ఇంట్లో లేనప్పుడు తమ అమ్మకు పుట్టినరోజు కేక్ ఇచ్చేందుకు ఇంటికి వచ్చిన విష్ణు బౌన్సర్లతో కలిసి జనరేటర్‌లో చక్కెర కలిపిన డీజిల్ పోశాడని ఆరోపించిన విషయం తెలిసిందే.. అయితే మనోజ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఒక చిట్ చాట్‌లో స్పందించాడు మంచు విష్ణు. మంచు కుటుంబం నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమాలో మంచు విష్ణు హీరోగా నటిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రబృందం. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎక్స్‌లో అభిమాను లతో ముచ్చటించారు విష్ణు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఇంత మంచిగా రిప్లయి ఇస్తున్నావు మంచి మనసు నీది. ఎందుకు ఆరోజు మనోజ్ ఇంట్లో ఉన్న జనరేటర్‌లో చక్కెర పోశావు అని అడిగాడు. దీనికి మంచు విష్ణు సమాధాన మిస్తూ.. ఫ్యూయల్‌లో చక్కెర పోస్తే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్‌లో చదివాను అందుకే పోశానంటూ చెప్పుకోచ్చాడు. దీంతో ఈ కామెంట్ విపరీతంగా వైరల్‌గా మారింది. ఇంకో నెటిజన్ కన్నప్ప బడ్జెట్ ఎంత అని అడు గగా.. బిగ్ బడ్జెట్. నా గత చిత్ర బడ్జెట్‌కు 10 రెట్లు ఎక్కువ అంటూ సమాధానమిచ్చాడు.
Never leaving this app#Prabhas tho undi motham maripoyindu ❤❤ #ManchuVishnu#AskVishnu #Kanappa pic.twitter.com/aerUaIirMT
— Nikhil varma ᴿᴱᴮᴱᴸᵂᴼᴼᴰ (@nani_nikhil007) February 28, 2025

మీ సన్నిహిత మహిళకు, మహిళా భాగస్వామికి లేదా మీ సోదరికి, మదర్‌కి ఎవరైన మహిళలకు మంచి గిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా…? ఒక సారి నాయిస్ దియా స్మార్ట్ వాచ్ ను పరిశీలించండి..
ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://amzn.to/3QIAGOS
Bank jobs”బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (BOI) అప్రెంటిస్ 400 పోస్టులకు రిక్రూట్‌మెంట్
Petrol” ఆ వాహనాలకు పెట్రోల్ బంద్ .. వాటిని గుర్తించేందుకు గ్యాడ్జెట్లు
Smart TV” 40 ఇంచుల బ్రాండెడ్ టీవీ కేవలం రూ. 16,990లకే..
Karimnagar news” బీసీల గెలుపుతోనే సామాజిక తెలంగాణ సాధ్యం:
