Nallagonda Temple”
తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ సీతారామ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం చైర్మన్‌గా బండారిపెల్లి లక్ష్మణ్ తిరిగి నియామకమయ్యారు. లక్ష్మణ్ తోపాటు, గత పాలకవర్గ సభ్యులే ఈసారి కూడా కొనసాగింపుగా నియమితులయ్యారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
ఈ సందర్భంగా, బుధవారం ఎల్ఎండీ కాలనీలోని MLA క్యాంపు కార్యాలయంలో ఈ ఉత్తర్వులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అందజేశారు.
ఎమెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి ప్రధాన లక్ష్యం కావాలని, ఈ దిశగా పాలకవర్గం అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. గతేడాది పాలకవర్గ పనితీరు అనుకూలంగా ఉండటంతో, ఈసారి కూడా అదే వర్గం కొనసాగింపుగా నిశ్చయించామని చెప్పారు.
MLA సూచించినవి:
-
పాలకవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం దేవస్థానం పనులను వేగవంతం చేయడం
-
ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం
-
దాతల నుంచి విరాళాలు సేకరించి పారదర్శకంగా నిర్వహించడం
-
భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం
ఎమెల్యే డాక్టర్ కవ్వంపల్లి ఆలయ అభివృద్ధి కోసం తన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బండారిపెల్లి లక్ష్మణ్, పాలకవర్గ సభ్యులు గాజుల అంజయ్య, బూత్కూరి శ్రీనివాస్, కవ్వంపల్లి మహేశ్, జినుక శ్రీనివాస్, గోలి లక్ష్మి, కందుకూరి లక్ష్మిరాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ ఎల్ గౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, పార్టీ నాయకులు గోపు మల్లారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కొత్త తిరుపతిరెడ్డి, రొడ్డ సాగర్, చిట్టి బాబు, సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Sugar mill” భారీ వర్షం.. 2 లక్షల క్వింటాళ్ల చక్కెర కరిగిపోయింది..
Medaram dates” మేడారం జాతర 2026 తేదీలు ప్రకటన
Reels focus” చూసుకోవాలి కదా అక్కా… “ఫోకస్ అంతా రీల్‌పై.. పోయిందేదో చూసుకో
