Kesavapatnam Hostel” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా – శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని బుధవారం రోజు మండల వైద్యాధికారి డా. గొట్టే శ్రావణ్ కుమార్ బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీ సందర్భంగా వసతి గృహంలో అందిస్తున్న ఆహారం మెనూ గురించి వంటమాస్త్రితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో వసతి గృహ వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా సమాచారం అందించారన్నారు.
డా. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, “ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి. వాతావరణ పరిశుభ్రత పాటించాలి. ఇది విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి మేలు చేస్తుంది,” అని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో ఆయుష్ డాక్టర్ సంధ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్, ఇతర వైద్య బృందం సభ్యులు పాల్గొన్నారు.
