శుక్రవారం రాత్రి మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 632 మంది మృతి చెందారు. మో 329 మంది గాయపడ్డారు. మొరాకాలోని రబత్ నుంచి మరకేష్ వరకు ముఖ్యమైన పట్టణాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వారి వారి ఇళ్లు, ఆఫీస్‌ల బయటకు పరుగులు తీశారు. మరకేష్‌కు దక్షిణ దిశలో దాదాపు 70 కిలోవిూటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వోన్ డెర్ లెయెన్ ఇచ్చిన ట్వీట్‌లో, ఈ కష్టకాలంలో మొరాకో ప్రజలకు సంఘీభావం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. భూకంప బాధితులకు హుటాహుటిన సహాయపడిన అధికారులు, సిబ్బంది సేవలను ప్రశంసించారు. మొరాకో ఇంటీరియర్ మినిస్టీ తెలిపిన సమాచారం ప్రకారం, మరకేష్‌లోని ఆసుపత్రులకు భూకంప బాధితులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వీరందరికీ చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ భూకంపం వల్ల నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఉత్తర ఆఫ్రికాలో భూకంపాలు సంభవించడం చాలా అరుదు. పర్వత ప్రాంతాల్లో ఇంత భారీ భూకంపం రావడం అసాధారణ విషయమని భూకంప పర్యవేక్షక, హెచ్చరికల శాఖ తెలిపింది. అమెరికన్ జియొలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం ఈ భూకంపం శుక్రవారం రాత్రి 11.11 గంటలకు సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 6.8గా నమోదైంది. ప్రజలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నట్లు కనిపిస్తున్న వీడియోలను చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన మరో లారీ ఆ లారీని ఢీకొన్న కారు, బైక్