New Ration Cards” మాటకు కట్టుబడే కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

New Ration Cards” పర్లపల్లిలో కలెక్టర్ తో కలిసి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన కవ్వంపల్లి…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు.

తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలోని రైతు వేదికలో శుక్రవారం మొగిలిపాలెం, నల్లగొండ,బాలయ్యపల్లి, మక్త, పర్లపల్లి, పోలంపల్లి,నర్సింగపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తో కలిసి ఆయన కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ. గత పాలకులు పదేళ్ల కాలంలో ప్రజలకు ఉపయోగపడే పనులేవీ చేయలేదని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తోందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చి మాటకు కట్టుబడి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, దీని కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాలశాఖామాత్యులు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతగానో శ్రమించారని కొనియాడారు.

కొత్త రేషన్ కార్డులు పొందడం కలగా మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కార్డులిచ్చి వారి ఏళ్లనాటి కలను సాకారం చేశామన్నారు. 2014 కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇవ్వగా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మళ్లీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి గుర్తు చేశారు.

పేదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులే కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా ఇవ్వలేక పోయిందని ఆయన విమర్శించారు. కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను గత బీఆర్ఎస్ పాలకులు ఎందుకు ఇవ్వలేకపోయారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుందని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డు అందుతుందని, కార్డు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణగౌడ్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు రాచపల్లి సరిత, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, మామిడి అనిల్ కుమార్, గొట్టిముక్కుల సంపత్ రెడ్డి, గోగూరి నర్సింహారెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, బుధారపు శ్రీనివాస్ , పోలు రాము, రమేశ్, బండారుపెల్లి లక్ష్మణ్, కాసర్ల సంపత్, బుర్ర అజయ్, దొంత శ్రీనివాస్, చెన్నబోయిన రవి, పెంట వినోద్ కుమార్, గుంటి మల్లేశం, మెరుగు మోహన్, బి.సంపత్, బి.శ్రీనివాస్, రజాక్,ఆశిక్ పాషా, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

బిడ్డల తొలి బుక్కు! ✨
పిల్లల బుద్ధి పదునయ్యే పుస్తకం!
అక్షరాలు | సంఖ్యలు | ఆకారాలు
రంగులు | వాహనాలు | జంతువులు
‍⚕️ వృత్తులు | శరీర భాగాలు
మన చుట్టూ ఉన్న వస్తువులు!

నేర్చుకోవడం = ఇప్పుడు ఆటలా మారింది!
2 నుండి 6 ఏళ్ల చిన్నారులకి బెస్ట్ బుక్ ✅
పూర్తిగా రంగురంగుల బొమ్మలతో!

ఇప్పుడే ఆర్డర్ చేయండి!
మీ బిడ్డకి తెలివితేటలు నేర్పే మొదటి మెట్టు ఇది! https://amzn.to/3THLT3Mలింక్ పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *