Pakistan” పాకిస్తాన్ ఎప్పుడు వక్రబుద్దే చూపిస్తుంటుంది. పహగాల్గమ్ దాడి తర్వాత భారత్ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఆ దాడితో మాకు సంబంధం లేదంటూనే పాకిస్తాన్ యుద్దానికి కాలు దువ్వుతోంది. రోజుకో మంత్రి రోజుకో రకంగా ప్రకటిస్తున్నారు. ఉగ్రవాదాన్ని తామే పెంచి పోషించామని ఒకరు అంటే.. మా దగ్గర అణుబాంబులున్నాయి యుద్దం వస్తే అవి భారత్ వైపే గురిపెడుతామని మరొకరు ప్రకటించారు. ఇప్పటికే పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఫైల్స్ కారణంగా హాస్పటల్ జాయిన్‌అయ్యాడని సమాచారం. అలాగే అక్కడి ఆర్మీ చీఫ్ కనబడట్లేదు దేశం విడిచి పారిపోయాడని కూడా వినబడుతోంది. మరోవైపు పాక్ ఆర్మీలోని సైనికులు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. రెండు రోజుల క్రితం 1450 మంది రాజీనామా చేశారని వార్తలొచ్చాయి. తాజాగా ఈ సంఖ్య 5 వేలకు చేరిందంటున్నారు. ఈ తరుణంలో పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అతుల్లా తరార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటల్లో భారత్ తమపై దాడిచేస్తుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించిందని ట్వీట్ చేశారు. పాకిస్తాన్‌లో అంతర్గత సమస్యలు మొదలయ్యాయి.. ఇక బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. సింధూ రాష్ట్రంలో నదీ జలాల కోసం తిరుగుబాటు చేస్తున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి.