Local news ” శ్రీ భూ నీలా సమేత మత్స్య గిరింద్ర స్వామి..
ఆలయ అభివృద్ధి కోసం విరాళాల సేకరణ…
అభివృద్ధికి 40 లక్షలు ప్రభుత్వం మంజూరు..
ఆలయ ప్రధాన అర్చకులు శేషం మురళీధరాచార్యులు…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ భూనీలా సమేత శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం భక్తులు దాతలు ముందుకు రావాలని ఆలయ ప్రధాన అర్చకులు శేషం మురళీధర్ ఆచార్యులు కోరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మురళీధర ఆచార్యులు మాట్లాడారు. దశ అవతారాల్లోని ఒక అవతారమైన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ భూనీలా సమేత శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న గుట్టపై కలదు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమై భక్తుల ఇళ్లలో వెలిసే శ్రీ మత్స్య గిరింద్ర స్వామి ఆలయ అభివృద్ధి కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ 40 లక్షల రూపాయలను మంజూరు చేసిందని, ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో రాజగోపుర నిర్మాణం చేయుటకు అధికారులు నివేదికలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం సుమారు 30 లక్షల వరకు అధనంగా ఖర్చు అవుతాయని అధికారులు తెలియజేసినట్లు పేర్కొన్నారు. భక్తులు దాతలు ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు విరాళాలను అందజేయుటకు ముందుకు రావాలని కోరారు. దేవాదాయ ధర్మాదాయ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, కొత్తగట్టు గ్రామస్తులు భక్తులు ఈనెల 28న దేవాలయ ప్రాంగణంలో సమావేశమై, ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు సేకరించుట కోసం సమావేశమై విరాళాల కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించి శ్రీ మత్స్య గిరీద్ర స్వామి, శ్రీ భూ నీలాదేవి సమేత ఆలయ అభివృద్ధికి కృషిచేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ప్రధాన అర్చకులు మురళీధర ఆచార్యులు కోరారు.
