Local News” 100 శాతం ఉత్తీర్ణత….
శంకరపట్నం: డిసీ ప్రతినిధి
ఎస్ ఎస్ సి పరీక్ష ఫలితాల్లో ఆల్ఫ్రెడ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని, కేశవపట్నం లో గల ఆల్ఫ్రెడ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రతిభను చాటుతున్నారు. 2024/2025 విద్యా సంవత్సరానికి 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాల పేరును జిల్లా , రాష్ట్రస్థాయిలో ముందంజలో లో 31 మంది విద్యార్థులు ఎస్ఎస్సి కామన్ పరీక్షలకు హాజరుకాగా 100% ఉత్తీర్ణత సాధించారు. కరస్పాండెంట్ గుర్రం వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు మాథ్యూ, విద్యార్థుల విద్యా బోధనలపై ప్రత్యేక శ్రద్ధ నిరంతర పర్యవేక్షణ కొనసాగించడంతో ఆల్ఫ్రెడ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు విద్యలో ప్రతిభ కనబరిచారు. కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయుడు మాథ్యూ సేవలు అభినందనీయంగా ఉన్నాయని, విద్యార్థులు ,తల్లిదండ్రులు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
