Upsc exams” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో కొత్త పథకానికి ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. (Civils) సివిల్స్ అభ్యర్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా ఈ పథకం ఉండనుంది. ప్రజాభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రాజీవ్‌గాంధీ (Civils) సివిల్స్ అభయహస్తం అనే పథకాన్ని శనివారం ప్రారంభించారు. దీంట్లో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తెలంగాణ అభ్యర్థులకు (singareni) సింగరేణి సంస్థ నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగిందని చెప్పారు. తెలంగాణ త్యాగాల పునాదులపై ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వ ముఖ్య ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడ మేనన్నారు. అందుకే కోసమే అధికారంలోకి వచ్చిన మూడు మాసాల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్టు వివరించారు. పదేండ్లలో నిరుద్యోగులకు తీర్చలేని నష్టం వాటిల్లిందని వాపోయారు. (Tgpsc) టీజీపీఎస్సీని (Upsc) యూపీఎస్సీ మోడల్‌లో మార్పులు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరామ్ తదితరులు పాల్గొన్నారు.
Gujarath school” క్లాస్ రూం గోడకూలి.. పై నుంచి కింద పడ్డ విద్యార్థులు.. వీడియో
Viral Video” ఈ పెద్దాయన క్రియేటివీటియే వేరు.. కొనియాడిన ఆనంద్ మహింద్రా.. వీడియో..
Shocking Road Accident” వేగంగా బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఎగిరిపడ్డ దంపతులు.. సీసీ టీవీ వీడియో
Maharastra crime news”సరదా కౌగిలింతనో… ప్రాంక్ వీడియోనో కానీ మహిళ ప్రాణం తీసింది.. వీడియో
Maharastra crime news”సరదా కౌగిలింతనో… ప్రాంక్ వీడియోనో కానీ మహిళ ప్రాణం తీసింది.. వీడియో