Manchiryal Crime” ఫోన్ బాగు చేయించలేదని మనస్తాపంతో యువతి ఆత్మహత్య

Manchiryal Crime

Manchiryal Crime”  క్ష‌ణికావేశంలో నూరేళ్ల జీవితాన్ని ఓయువ‌తి అర్థంత‌రంగా ముగించింది. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండ‌లం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అయితే కూతురు సాయిసుమా (19) సెల్ ఫోన్ బాగు చేయించాల‌ని తల్లిదండ్రులను కోరింది. ప్ర‌స్తుతం ఆర్థిక ప‌రిస్థితులు బాగాలేవు కొద్ది రోజుల త‌రువాత చేయిస్తామ‌ని త‌ల్లిదండ్రులు మంద‌లించారు. దీంతో మ‌న‌స్థాపం చెందిన సాయి సుమా త‌ల్లిదండ్రులు పొలం ప‌నుల‌కు వెళ్లిన త‌ర్వాత ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *