Railway” రైల్వే శాఖ కీలక మార్పులు తీసుకువస్తోంది. జూలై 1వ తేదీ అర్ధరాత్రి నుంచి కొత్త టికెట్ ధరలు అమలులోకి వస్తాయని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జోన్‌లకు సర్క్యులర్ జారీ అయింది.
తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం ఇకపై ఆధార్ తప్పనిసరిగా ఉండనుంది. ఈ కొత్త నిబంధన జూలై 1 నుంచి అమలులోకి రానుంది.
పెరిగిన ఛార్జీలు ఇలా ఉన్నాయి:
సెకండ్ క్లాస్ ఆర్డినరీ టికెట్లు:
0–500 కి.మీ వరకు ఛార్జీల్లో మార్పు లేదు.
501–1500 కి.మీ వరకు టికెట్‌దరపై ₹5 పెంపు.
1501–2500 కి.మీ వరకు ₹10 పెంపు.
2501–3000 కి.మీ వరకు ₹15 పెంపు.
ఆర్డినరీ స్లీపర్/ఫస్ట్ క్లాస్ టికెట్లు:
కి.మీకు 0.5 పైసల చొప్పున పెంపు.
నాన్-ఏసీ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు:
నాన్-ఏసీ ఫస్ట్, సెకండ్, స్లీపర్ క్లాస్ టికెట్లపై కి.మీకి 1 పైసా చొప్పున పెంపు.
ఏసీ రైళ్లకు:
అన్ని తరగతులపై కి.మీకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెరుగుతాయి.
అయితే, రిజర్వేషన్ ఛార్జీలు మరియు సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్‌లలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే బుకింగ్ చేసిన టికెట్లపై పెరిగిన ఛార్జీలు వర్తించవని రైల్వే శాఖ తెలిపింది.
Sugar mill” భారీ వర్షం.. 2 లక్షల క్వింటాళ్ల చక్కెర కరిగిపోయింది..
Smartwatch” అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్టైలిష్ స్మార్ట్‌వాచ్
