Ration Card Distribution” శంకరపట్నం డిసిపి ప్రతినిధి: శంకరపట్నం మండల పరిధిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆదివారం నిర్వహించనున్నట్లు హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) పాత రమేష్ బాబు శనివారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు.
మండలంలో మొత్తం 1,365 దరఖాస్తులలో 1,213 మంది అర్హులుగా గుర్తించబడిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎంపిక చేసిన లబ్ధిదారులకు మంత్రుల చేతుల మీదుగా రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.
మండల పరిధిలో ప్రస్తుతం 37 రేషన్ షాపులు ఉన్నాయని, చేర్పులు మరియు మార్పుల ప్రక్రియలో 20,243 మందిని నూతనంగా రేషన్ కార్డులలో చేర్చినట్లు రమేష్ బాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులు పూర్తిగా ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కే. సురేఖ, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, మత్స్య గిరీంద్ర స్వామి ఆలయ చైర్మన్ కోరెం రాజిరెడ్డి, మాజీ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బండారి తిరుపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొజ్జ చంద్రమౌళి, యువత నేతలు మహమ్మద్ షారుక్, గొట్టె మధు, నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంట్లో ఆరోగ్యకరమైన భోజనం కోసం సూపర్ కిచెన్ గ్యాడ్జెట్!
️ ఇందస్ వాలీ క్యాస్ట్ ఐరన్ తవా
చపాతీలు, దోసెలు ఇక సులభం + రుచికరంగా!
100% స్వచ్ఛమైన & టాక్సిన్-ఫ్రీ
ఉచితంగా వస్తున్న వుడ్ స్పాటులాతో పాటు
నేచురల్ నాన్-స్టిక్ – ఎలాంటి కోటింగ్ అవసరం లేదు
⚡ ఇండక్షన్ ఫ్రెండ్లీ కూడా!
Size: 27.6cm / 10.8 inch
⚖️ బరువు: 2.8kg – గట్టి & స్ట్రాంగ్
ఆరోగ్యకరమైన వంట కోసం, ఇప్పుడే ట్రై చేయండి!
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/4m0I5an లింక్ ను క్లిక్ చేయండి

boAt Aavante Prime 5.1 – 2025 లాంచ్!
500W పవర్ఫుల్ సౌండ్ – ఇంటి లోపల థియేటర్ లా ఫీల్!
Dolby Atmos – 3D Surround Experience
5.1 Channel:
➡️ వయర్డ్ Subwoofer + వయర్డ్ Satellites
బ్లూటూత్, AUX, USB – మల్టీ-కంపాటిబిలిటీ
స్టైలిష్ “Premium Black” డిజైన్
నూతన 2025 మోడల్ – ట్రెండ్ సెట్టర్!
హోమ్ థియేటర్ అనుభూతి ఇప్పుడు నీ ఇంట్లోనే!
వీడియోలు, పాటలు, గేమ్స్ – అంతా అనుభూతి!
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/3IUFGznలింక్ పై క్లిక్ చేయండి..
