భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 17 (Redmi Note 17) సిరీస్ లాంచ్ తేదీ అధికారికంగా ఖరారైంది. గతంలో ప్రచారంలో ఉన్న ఊహాగానాలను నిజం చేస్తూ, ఆగస్టు 6న రెడ్‌మీ నోట్ 17 మరియు నోట్ 17 ప్రో మోడళ్లను భారత్‌లో విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రకటనతో పాటు విడుదల చేసిన టీజర్లలో ఈ ఫోన్ నీలం (Blue), ఊదా (Purple) రంగులలో ఆకట్టుకుంటోంది.
రెడ్‌మీ నోట్ 17 – ముఖ్యమైన ఫీచర్లు:
-
భారీ బ్యాటరీ: ఈ ఫోన్‌లో ఏకంగా 8,000mAh బ్యాటరీని అందిస్తున్నట్లు స్పష్టమైంది.
-
డిస్‌ప్లే: అధునాతన AMOLED స్క్రీన్ తో రానుంది.
-
ప్రాసెసర్ & ఆపరేటింగ్ సిస్టమ్: గీక్‌బెంచ్ (Geekbench) లిస్టింగ్ వివరాల ప్రకారం.. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) ప్రాసెసర్‌తో పాటు 8GB RAM మరియు ఆండ్రాయిడ్ 16 (HyperOS 3) తో పనిచేస్తుంది.
-
కెమెరా: చైనా వర్షన్ మాదిరిగానే ఉంటే, ఇందులో 50MP ప్రైమరీ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది.
టైటిళ్లపై క్లిక్ చేసి ఇవి కూడా చదవండి
భారతదేశంలో ₹20,000 నుండి ₹30,000 బడ్జెట్‌లో లభించే ఉత్తమ 5G స్మార్ట్‌ఫోన్లు!
రూ. 30,000 లోపు టాప్ AI స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు, బ్యాటరీ వివరాలు ఇక్కడ చూడండి!
