కరీంనగర్:
జిల్లావ్యాప్తంగా గత 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నిన్న (మంగళవారం) ఉదయం 8:30 గంటల నుంచి ఈరోజు (బుధవారం) ఉదయం 8:30 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం జిల్లా సగటు వర్షపాతం 42.7 మిల్లీమీటర్లుగా నమోదైంది.
మ్యాన్యువల్ రెయిన్‌గేజ్ (Manual Raingauge) ఆధారంగా సేకరించిన వర్షపాత వివరాల ప్రకారం… అత్యధికంగా గంగాధర మండలంలో 88.6 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, చొప్పదండి మండలంలో 85.6 మి.మీ., రామడుగు మండలంలో 79.2 మి.మీ. భారీ వర్షం కురిసింది.
మండలాల వారీగా వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో):
| క్రమ సంఖ్య | మండలం పేరు | నమోదైన వర్షపాతం (మి.మీ.) |
| 1 | గంగాధర | 88.6 |
| 2 | చొప్పదండి | 85.6 |
| 3 | రామడుగు | 79.2 |
| 4 | మానకొండూర్ | 40.2 |
| 5 | జమ్మికుంట | 40.2 |
| 6 | కరీంనగర్ | 36.8 |
| 7 | చిగురుమామిడి | 34.8 |
| 8 | కరీంనగర్ (రూరల్-II) | 34.2 |
| 9 | ఇల్లందకుంట | 32.4 |
| 10 | వీణవంక | 31.2 |
| 11 | వి.సైదాపూర్ | 30.0 |
| 12 | శంకరపట్నం | 28.6 |
| 13 | గన్నేరువరం | 28.2 |
| 14 | హుజూరాబాద్ | 28.2 |
| 15 | తిమ్మాపూర్ | 22.4 |

-
మొత్తం వర్షపాతం: 640.6 మి.మీ.
-
జిల్లా సగటు వర్షపాతం: 42.7 మి.మీ.
జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా … లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
టైటిళ్లపై క్లిక్ చేసి ఇవి కూడా చదవండి
జగిత్యాల GGHకు ‘స్పెషాలిటీ’.. కరీంనగర్‌కు ‘సూపర్ స్పెషాలిటీ’ హబ్ హోదా: మంత్రి దామోదర రాజనర్సింహ
తెలంగాణలో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు! జిల్లాల వివరాలు ఇవే!
