Road Accident” రోడ్డు ప్రమాదం : దైవదర్శనానికి వెళ్లి తిరిగివస్తూ తండ్రికి తీవ్ర గాయాలు

Road Accident”  శంకరపట్నం, డిసి ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం గొల్లపల్లి శివారులో జాతీయ రహదారిపై శనివారం రోడ్డు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే… హనుమకొండకు చెందిన బి. ప్రకాష్, త‌న కొడు సుధీర్తో కలిసి ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో
వారు ప్రయాణిస్తున్న కారు, ఎదురుగా వ‌స్తున్న గుర్తుతెలియని క్రేన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రకాష్‌కు తీవ్ర గాయాలు కాగా, కొడుకు సుధీర్‌ స్వల్ప గాయాలయిన‌ట్టు తెలిసింది.

స్థానికులు సమాచారాన్ని అందించడంతో వెంటనే 108 ఎమర్జెన్సీ సేవల బృందం ఘటన స్థలానికి చేరుకుంది. ఈ ఎన్‌టీ గూడూరి సతీష్ రెడ్డి, పైలట్ మతి గోపికృష్ణ కలిసి బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. ప్రకాష్‌ను మెరుగైన వైద్యం కోసం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై స్థానిక బూకోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని క‌రీంన‌గ‌ర్ వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *