కొంత మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఊడిపోయాయి.. బస్సు నెమ్మదిగా ఉండడంతో పెద్దప్రమాదేమే తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి హన్మకొండ వెళ్తున్న పల్లెవెలుగు బస్సు ఎల్కతుర్తి మండల కేంద్రానికి చేరుకోగానే వెనక టైర్లు ఊడిపోయాయి.. వెంటనే డ్రైవర్ బస్సును నిలిపి వేశాడు. ప్రయాణికులను ఇతర బస్సుల్లో వారి గమ్య స్థానాకులకు చేర వేశారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దీనికి కారణం పరిమితికి మించేనని ప్రచారం సాగింది. ఈ ఘటనపై ఆర్టీసీ ఏండీ సజ్జనార్ స్పందించారు. ఈ ప్రమాద ఘటనపై వెంటనే ఏండీ విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను నిర్ధేశించారు. ఎక్స్ ( ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. బస్సుల్లో 80 మంది ప్రయాణికులు ఉన్నట్టు సాగిన ప్రచారంలో ఎలాంటి అవాస్తవం లేదని తెలిపారు. ప్రమాద ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. అద్దె బస్సు డ్రైవర్ రాజు అప్రమత్తమై.. బస్సును వెంటనే ఆపడం వల్ల ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వివరించారు. బస్సులోని 42 మందిని సురక్షితంగా మరొక బస్సులో టీఎస్‌ఆర్టీసీ అధికారులు పంపించారని తెలిపారు.
అద్దె బస్సుల నిర్వహణ విషయంలో వాటి యజమానులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తరచూ తనిఖీలు చేస్తూ.. తమ బస్సులను ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకోవాలని సూచించారు. బస్సుల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షితమైన ప్రయాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా పూర్థి సామర్థ్యంతో బస్సులను నడపాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు.
ఏదో చేయబోయి.. నవ్వులపాలై.. రైళ్లో వీడియో
ఉమ్మడి జిల్లాలకు ఇన్ చార్జ్ మంత్రులు వీరే..
రీల్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం.. రోడ్డుపై వెర్రి చేష్టలు వేసిన యువతి ఆర్టీసీ ఎండీ ఆగ్రహం