నేటి యువత ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు. తాము చేసే వీడియో క్లిప్పులు వైరల్‌గా మారాలని, లక్షల్లో వచ్చే వ్యూస్, లైక్స్ కోసం పిచ్చి చేష్టలు చేస్తున్నారు. అలాంటి వీడియోన ఒకదానిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేశారు. ఆ వీడియోలో ఓ యువతి మెల్లిగా రోడ్డుపైకి వెళ్లి తన భుజానికి ఉన్న బ్యాగ్ విసిరేస్తుంది.
రక్తాన్ని రంగరించి.. 60 ఏండ్ల గోసను పోగొట్టాం కేటీఆర్
అంతటితో ఆగకుండా ట్రాఫిక్ సిగ్నల్ పడగానే రోడ్డుపై పడుకుని పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అక్కడున్న వారంతా ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆర్టీసీ ఏండీ ఈ విధంగా రాసుకొచ్చారు. ‘నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనదంమో.. ఏమో!?’
నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి… pic.twitter.com/RQ6aGEWUet
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 24, 2023
ఆ బస్సులను అక్కడే ఆపుతాం… మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసిన ఆర్టీసీ ఏండీ సజ్జనార్
బావా నువ్వు కూసో.. నేను నడుపుతా.. ఒకే కారులో మాజీ మంత్రులు