యాసంగి సాగు కు సంబంధించిన రైతు బంధును 28 లోపు రైతుల ఖాతాల్లో నిలిపి వేయాలని రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చిన విషయం తెలిసింది. అయితే తాజాగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ తగిలినట్టయింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రైతు బంధు 28వ తేదీన రూ. 7000 కోట్ల రూపాయ రైతు బంధు నిధులు అన్నదాతల ఖాతాలో జమ కావాల్సి ఉంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతు బంధు పంపిణీకి బ్రేక్ పడింది. 30 నాడు ఎన్నికలు పెట్టుకొని 28 నాడు రైతు బంధు జమ ఏంటని ఈసీ ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
దానికోసమే తండ్లాతున్నాం.. జగిత్యాలలో కేసీఆర్ ఎమోషనల్ స్పీచ్