Saiyaara movie”
బాలీవుడ్‌లో తక్కువ బడ్జెట్‌తో వచ్చిన సినిమా “సైయారా” అంచనాలకు మించి విజయాన్ని అందుకుని, అతి తక్కువ సమయంలోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా రూ.150 కోట్లకుపైగా వసూళ్లను సాధించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
సాధారణంగా స్టార్ హీరోలు, భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కే చిత్రాలకే ఇంత స్థాయి వసూళ్లు సాధ్యమవుతాయి. కానీ “సైయారా” కథన బలం ద్వారా చిన్న సినిమాలకూ పెద్ద విజయాలు సాధ్యమేనని మరోసారి నిరూపించింది.
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, ఈ సినిమాతో ఆహాన్ పాండే, అనిత్ పడా బాలీవుడ్‌లోకి పరిచయమయ్యారు. ప్రేమ కథా నేపథ్యంలో సాగే ఈ చిత్రం విడుదలైన వెంటనే మౌత్ టాక్ లేకుండానే బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు నమోదు చేసింది.
-
మొదటి రోజే రూ.21 కోట్లు,
-
రెండో రోజు రూ.24 కోట్లు,
-
మూడో రోజు రూ.35 కోట్లు,
మొత్తం వారం రోజుల్లో రూ.150 కోట్లు దాటిందని చిత్రబృందం తెలిపింది.
ఈ విజయంతో బాలీవుడ్‌కు తిరిగి జోష్ వచ్చిందని సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో, “సైయారా” టీమ్ ఈ అపూర్వ విజయాన్ని సంతోషంగా స్వీకరిస్తోంది.
Border Conflict” మరో రెండు దేశాల మధ్య యుద్దం షురూ…? తాజా అప్‌డేట్స్
