థియేటర్లలోకి వస్తున్న పలు సినిమాలు
ఈ ఏడాది చివరికి చేరుకుంది. నెలాఖరులో పెద్ద సలార్, డంకీ లాంటి చిత్రాల హవా ఉండడంతో చిన్న చిత్రాలు అన్ని ఈ వారం విడుదలకు వరుస కట్టాయి. ఈ వారం థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాల్లో జోరుగా హుషారుగా… ఒకటి. విరాజ్ అశ్విన్ హీరోగా అను ప్రసాద్ తెరకెక్కిస్తున్న చిత్రంజోరుగా హుషారుగా, అను ప్రసాద్ దర్శకత్వంలో నిరీష్ తిరువిధుల నిర్మించారు. పూజిత పొన్నాడ కథానాయిక. బేబీతో పాపులర్ అయిన విరాజ్ నటిస్తున్న చిత్రమిది. పోస్టర్స్, ట్రైలర్స్ మెప్పించేలా ఉన్నాయి. ఈ నెల 15న విడుదల కానున్న ఈ చిత్రం చక్కని విజయం అందుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఇకపోతే పిండం చిత్రంతో ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్థమవుతున్నారు హీరో శ్రీరామ్. సాయికిరణ్ దైదా తెరకెక్కించిన ఈ చిత్రానకి యశ్వంత్ దగ్గుమాటి నిర్మాత. ఈ నెల 15న థియేటర్లలోకి వస్తోంది.. మరణం అనేది నిజంగానే అంతమా..? మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా? కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూవ్మిూద నిలిచిపోతాయా? ఆ ఆత్మలు నిజంగానే మనకు హాని చేయగలవా? అన్న అంశాలతో సస్పెన్స థ్రిల్లర్‌గా ఈ చిత్రం రాబోతోంది. ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హారర్ కలశ..భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో కొండా రాంబాబు తెరకెక్కించిన చిత్రం కలశ. రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించారు. అన్ని డిసెంబరు 15న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు అనూహ్య స్పందన వచ్చింది.
తికమక తాండ ..కవలలు హరికృష్ణ, రామకృష్ణ కథానాయకులుగా నటించిన చిత్రం తికమక తాండ యాని, రేఖ నిరోష కథానాయికలు. వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఒక ఊరి నేపథ్యంలో సాగే కథ ఇది. తికమక తాండా అని ఆ ఊరిని ఎందుకన్నారనేది తెరపైనే చూడాలి చిత్ర బృందం చెబుతోంది.క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం చే లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బి.ఆర్ సభావత నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ 15న ఈ చిత్రం విడుదల కానుంది.
టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ జనార్ధన్‌రెడ్డి రాజీనామా
మాజీ సీఎంను పరామర్శించిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటుడు చిరంజీవి