హీరోగా, కామెడీ యాక్టర్, సుపరిచితమైన సీనియర్ నటుడు చంద్రమోహన్ (82) శనివారం దవాఖానాలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్తవిన్న టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.
చంద్రమోహన్‌కు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు. హైదరాబాద్‌లో సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చంద్రమోహన్ హఠాన్మరణం వార్త తెలిసి సిని ప్రముఖులు దిగ్భాంతి తెలిపారు. 1945 మే 23న కృష్ణా జిల్లాలో చంద్రమోహన్ జన్మించారు. చంద్రమోహన్ అసలు పేరు మాల్లంపల్లి చంద్రశేఖర్‌రావు, ఆయన బాపట్ల అగ్రికల్చర్ కళాశాలలో డిగ్రి చదివారు. చిన్ననాడు నాటకాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చంద్రమోహన్ రంగుల రాట్నం సినిమా 1966లో సిని ఇండస్ట్రీకి పరిచమయ్యారు.
పనిలోంచి తీసేసిందని.. పగ పెంచుకుని చంపేశాడు.
1968లో `సుఖదుఖాలు` చిత్రంతో బ్రేక్ అందుకున్నారు. ఈ మూవీకిగానూ అవార్డులు అందుకున్నారు. ప్రఖ్యాత దర్శకుడు కే విశ్వనాథ్ కి కజిన్ అవుతారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.1968 లో రిలీజ్ అయిన సుఖదుఃఖాలు సినిమాతో బ్రేక్ అందుకున్నారు.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ తో ఇండస్ట్రీలో ఉన్నారు. 2017 వరకు సినిమాల్లో నటించారు. మొత్తంగా 900 కు పైగా సినిమాల్లో నటించారు. కుటుంబ కథా సినిమాలతో కథానాయకుడిగా ఉర్రూతలూగించారు. రంగుల రాట్నం`, `పదహారేళ్ల వయసు`, `సిరిసిరి మువ్వ సినిమాలు బాగా గుర్తింపు నిచ్చాయి..
కింది లింక్‌లను క్లిక్ చేసి పూర్తి వార్తలను చదవండి
ఆస్తికోసం సొంత బిడ్డపైనే గొడ్డళ్లతో దాడి.. సహకరించిన కొడుకులు
ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం..తల్లి ఇద్దరు పిల్లలు మృతి