ఘోర రోడ్డు ప్ర‌మాదం..త‌ల్లి ఇద్ద‌రు పిల్ల‌లు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో త‌ల్లి, ఇద్ద‌రు పిల్ల‌లు మృతి చెందిన ఘోర ఘ‌ట‌న మెద‌క్‌జిల్లా మ‌నోహ‌రాబాద్ మండ‌లంలోని క‌ల్ల‌క‌ల్ వ‌ద్ద గురువారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మెద‌క్ ప‌ట్ట‌ణం రాంన‌గ‌ర్ కాల‌నికి చెందిన మ‌లైకా సుల్తానా (30) త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి స్కూటీపై బుధ‌వారం మేడ్చ‌ల్‌లోని బంధువులు ఇంటికి వెళ్లింది. తిరిగి గురువారం ఉద‌యం మేడ్చ‌ల్ నుంచి ఇంటికి వ‌స్తుండ‌గా కాళ్ల‌క‌ల్ వ‌ద్ద‌కు రాగానే వెనుకు నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో మ‌లైకా సుల్తానా, ఆమె పిల్ల‌లు అద్నాన్ , ర‌కియా అక్క‌డికక్క‌డే మృతి చెందారు. చిన్న కూతురు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డింది. సుల్తానా భ‌ర్త ఉపాధి నిమిత్తం గ‌ల్ఫ్ వెళ్లాడు. సుల్తానా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

 

సైకిల్ పై వెళ్లి నామినేషన్ వేసిన సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ శివకుమార్

పువ్వులేవీ..? ప్రియాంక గాంధీ.. బొకే చూసిన న‌వ్విన వైనం వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *