తెలంగాణాలో కొత్త సర్కారు కొలువుదీరిన తరువాత ఉన్నతాధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరొక ఏడుగురు అధికారులను ప్రభుత్వం ఆదివారం బదిలీ చేసింది. ఇందులో ఆరుగురు ఐఎఎస్ అధికారులుండగా ఒకరు ఐఎపీఎస్ అధికారులున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వున్న భారతి హోలికెరిపై బదిలీ వేటు వేయడంతో పాటు ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. మేడ్చల్ కలెక్టర్ గా ఉన్న గౌతమ్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎక్సైజ్ కమీషనర్‌గా ఈ . శ్రీధర్, సివిల్ సప్లయ్ కమీషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్, ఇంటర్ విద్య డైరెక్టర్‌గా శృతిఓజా, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహారెడ్డిలను ఆదివారం నియమించింది.
ఊడిన బస్సు చక్రాలు..విచారణకు ఆదేశించిన ఆర్టీసీ ఎండీ