Vikarabad News” రైలు పట్టాల వద్ద ముక్కలైన ఓ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. పక్కనే పడి ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచామిచ్చారు. వారు ఆ మృతదేహం తమ వారిదే అని ఇంటికి తీసుకెళ్లారు. అంత్య క్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పాడెత్తుతున్న సమయంలో ఆ చనిపోయాడుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు. ఈ వింత ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లాలోని నవాంద్గీ గ్రామానికి చెందిన ఎల్లప్ప అనే అతను రెండు రోజుల క్రితం తాండూరులోని ఓ దుకాణంలో సిమెంటు బస్తాలు మోసే హమాలీ కూలీగా చేరాడు. ఈ నేపథ్యంలో అక్కడే పనిచేసే ఓ మరో వ్యక్తి (గుర్తుతెలియని)తో ఎల్లప్ప కలిసి తాండూరులో మందు తాగారు. ఎల్లప్ప మత్తులోకి జారుకున్నాడు. దీంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎల్లప్ప వద్ద ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్ దొంగలించి పారిపోతున్న క్రమంలో వికారాబాద్ రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతూ రైలు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సెల్ ఫోన్ లోని కాల్ డేటా ఆధారంగా మృతదేహం ఎల్లప్పదిగా భావించి వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. మృతదేహం ముక్కలుగా తెగి ఉండడంతో ఎల్లప్పదే శరీరంగా పొరపాటు పడి కుటుంబ సభ్యులు డెడ్ బాడీని వారి గ్రామానికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు రోదిస్తూనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయసాగారు. ఈ క్రమంలోనే హమాలిగా పనిచేస్తున్న ఎల్లప్పను తాండూరులో గుర్తించిన మరికొందరు అతనికి విషయం చెప్పారు. దీంతో ఎల్లప్ప వారి కుటుంబ సభ్యులకు ఫోన్ తాను బతికే ఉన్నానని అంత్యక్రియలు ఆపేయాలని చెప్పాడు. అనంతరం ఇంటికి చేరుకున్న ఎల్లప్పను చూసిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు షాక్ గురయ్యారు.
ఇవి కూడా చదవండి
bridge collapsed” కండ్ల ముందే కూలిన బ్రిడ్డి.. బీహార్‌లో మరో ఘటన
Video viral” ఇదేం స్టంట్‌రా నాయనా… నెత్తిమీద గ్యాస్ సిలిండర్లు.. వీడియో వైరల్
chai pepsi” ఇదేందయ్యా స్వామి కూల్ డ్రింక్‌తో టీ… వీడియో వైరల్
Daring reels” రీల్స్ పిచ్చి..పడితే పైకే.. ఒళ్లు జలదరించే వీడియో..
Crime news” డ్యాంలో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో రెండు అస్థిపంజరాలు