నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యాగణపతి నిమజ్జనం కార్యక్రమం గురువారం పూర్తయింది. 63 ఫీట్లు ఎత్తు, 40 టన్నుల బరువున్న ఖైరతాబాద్ గణేషుడు గంగమ్మ దరికి చేరాడు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అశేష జనం మధ్య గౌరి తనయుడు వీడ్కోలు పలికాడు. పోయిరా వినాయకా,, బైబై వినాయకా అంటూ జనం నినదించారు. సెక్రటేరియట్ వద్ద చివరి పూజలు చేసిన తరువాత 1.30 లకు నాలుగో నంబర్ క్రేన్ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యింది.
ఇవి కూడా చదవండి
తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు