sri Matsya Girindra Swamy” శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

sri Matsya Girindra Swamy” శంకరపట్నం (డిసీ ప్రతినిధి):
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. హిందూ ధర్మంలో దశావతారాలలో ఒకటైన మత్స్య అవతారం ఆధారంగా స్థాపించబడిన ఈ ఆలయం భక్తుల కోరికలు తీర్చే పవిత్ర క్షేత్రంగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఈవో కే. సుధాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు.   మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ ఈవో కే సుధాకర్ ధర్మకర్తల మండలి సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించారు.  ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ నియమాల మేరకు నూతనంగా ధర్మకర్తల మండలిని నియమించామని, వారు భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.

ప్రమాణ స్వీకరించిన ధర్మకర్తల మండలి సభ్యులు:

  • చైర్మన్: కోరెం రాజిరెడ్డి (సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కొత్తగట్టు గ్రామం)

  • సభ్యులు: తాడిచర్ల తిరుపతి, ఎడ్ల తిరుపతి, రామగిరి తిరుమల, కె. రత్నం, కె. లక్ష్మణరావు, ఎం. రవీందర్

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:

  • బత్తిని శ్రీనివాస్ గౌడ్ (టిపిసిసి సభ్యులు, మాజీ జెడ్పిటిసి)

  • గోపగోని బసవయ్య గౌడ్ (కాంగ్రెస్ మండల అధ్యక్షుడు)

  • చింతరెడ్డి పద్మ (మహిళా అధ్యక్షురాలు)

  • నాంపల్లి తిరుపతి (హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్)

  • గట్టు తిరుపతి గౌడ్ (జిల్లా ప్రధాన కార్యదర్శి)

  • ఆడెపు అజయ్ (యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు)

  • రెడ్డి పవన్ కుమార్ (బీసీ సెల్ మండలాధ్యక్షుడు)

  • ఉప్పుగల మల్లారెడ్డి (దేవస్థానం మాజీ చైర్మన్)

  • ఆలయ ప్రధాన అర్చకులు శేషం మురళీధర్ ఆచార్యులు, సహా అర్చకులు, సిబ్బంది

పలువురు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను ఘనవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *