- SriSeethaRamaKalyanam” కన్నాపూర్ వాలి–సుగ్రీవ ఆలయంలో వైభవంగా నిర్వహణశంకరపట్నం, డిసి ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామం లోని వాలి–సుగ్రీవ ఆలయంలో, నేడు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.గ్రామ మాజీ సర్పంచ్ మరియు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం మండలాధ్యక్షుడు తాటికొండ సదానంద చారి ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు.
భక్తుల సందడి మధ్య వైభవకర కళ్యాణం
ఈ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, ఆశేష భక్తజన సమూహం సాక్షిగా జరగనుంది. 30 సంవత్సరాలుగా శ్రీ సీతారాములు కొలువుదీరిన ఈ ఆలయంలో జరుగుతున్న ఈ మహోత్సవం, ఆలయ స్థాపన 30వ వార్షికోత్సవానికీ ప్రత్యేకత కలిగిస్తోంది.
సోమవారం వైశాఖ బహుళ సప్తమి వేడుకలు
వైశాఖ బహుళ సప్తమి సందర్భంగా సోమవారం నాడు పంచామృత అభిషేకం, అలంకరణ, విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు. అనంతరం శ్రీ సీతారాముల వారి కళ్యాణం కన్నులపండువగా జరుగుతుందని వారు పేర్కొన్నారు.
భక్తులకు ఆహ్వానం
ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలను స్వీకరించాలని సదానంద చారి కోరారు.
SriSeethaRamaKalyanam” నేడు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం
