tahsildar” తాసిల్దార్ సురేఖకు గణేష్ ఘనసన్మానం

tahsildar”  శంకరపట్నం, డిసి ప్రతినిధి:

తాసిల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన కే. సురేఖను బుధవారం తెలంగాణ జన సమితి పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, వెలుగునీడ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మోరే గణేష్ మర్యాదపూర్వకంగా కలుసుకొని ఘనంగా సన్మానించారు.

మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలానికి తాసిల్దార్‌గా బదిలీపై వచ్చిన సురేఖ గతంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి తాసిల్దార్గా కూడా విధులు నిర్వహించారు. శంకరపట్నంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.

సందర్భంగా గణేష్ మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరించే విధంగా తాసిల్దార్ సురేఖ గారి సేవలు ఉండాలని ఆకాంక్షిస్తున్నాం,” అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మావులూరి గణేష్, ఆర్ఐ ప్రత్యూష, సర్వేయర్ రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *