బంగాళాఖాతంలో ఉద్భవించిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో ఇది వాయుగుండంగా మారినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా రాబోయే నాలుగు నుండి ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.
జిల్లాల వారీగా వర్ష సూచన:
-
భారీ వర్షాలు కురిసే జిల్లాలు (ఉత్తర & తూర్పు తెలంగాణ): ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
-
మోస్తరు వర్షాలు కురిసే జిల్లాలు: నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా వానలు పడే అవకాశం ఉంది.
-
ఇతర జిల్లాలు: రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
అధికారుల హెచ్చరికలు & సూచనలు
-
ఈ నెల 31 వరకు పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
-
లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, వాగులు-వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
-
వరద ప్రవాహాలు ఉన్న రహదారులు, వాగుల వద్దకు వెళ్లకూడదని అధికారులు సూచించారు.
జూలైలో వర్షపాతం లోటు: ఈ ఏడాది జూలై నెలలో తెలంగాణ వ్యాప్తంగా 43% లోటు వర్షపాతం నమోదైంది. సాధారణంగా 227.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 109.7 మి.మీ మాత్రమే కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
టైటిళ్లపై క్లిక్ చేసి ఇవి కూడా చదవండి
నేటి నుంచి మండల రైతు వేదికల్లో 3 రోజుల ‘విత్తన మేళా’
నెలకు రూ. 20,000 అదనపు ఆదాయం: ఉద్యోగం చేస్తూనే పార్ట్‌టైమ్‌గా డబ్బు సంపాదించే 5 ఉత్తమ మార్గాలు!
భారతదేశంలో ₹20,000 నుండి ₹30,000 బడ్జెట్‌లో లభించే ఉత్తమ 5G స్మార్ట్‌ఫోన్లు!
