Tenetigaladadi” శంకరపట్నం: డిసి ప్రతినిధి:
పర్యటన కోసం వచ్చిన పర్యాటకులపై తేనెటీగలు దాడి చేసిన ఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. కరీంనగర్ కు చెందిన కుటుంబాలు 30 మంది పర్యటన కోసం గ్రామంలోని దూద్ బావి వద్దకు వచ్చి సేద తీరి, వంటలు చేసుకుంటున్న సమయంలో మర్రి చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో 30 మందికి గాయాలు కాగా పరుగులు తీసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తేనెటీగలను తొలగించి పర్యాటకులను గ్రామస్తులను కాపాడాలని కోరుచున్నారు.
Tenetigaladadi” 30 మంది పర్యాటకులపై తేనెటీగల దాడి…
