Alaya Committee” ఆలయ కమిటీ చైర్మన్ గా కృష్ణారెడ్డి..

Alaya Committee”  శంకరపట్నం :డిసి ప్రతినిధి:
శ్రీ సీతా రామాంజనేయ ఆలయ కమిటీ చైర్మన్గా లింగంపల్లి కృష్ణారెడ్డి, సెక్రటరీగా ఇనుకొండ తిరుపతిరెడ్డి ఏకగ్రీవంగా నియామకమైనట్టు నూతన అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని కాచాపూర్ గ్రామంలో గల శ్రీ సీతారామాంజనేయ ఆలయ కమిటీ సమావేశాన్ని గ్రామంలో నిర్వహించి అధ్యక్షులుగా లింగంపల్లి కృష్ణారెడ్డి, సెక్రటరీగా వినుకొండ తిరుపతిరెడ్డి తో పాటు మరికొంతమందిని సభ్యులుగా నియామకం చేసినట్లు నూతన చైర్మన్ కృష్ణారెడ్డి తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి, తమ నియామకానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి లింగంపల్లి కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపి ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *