Monday , 11 November 2024
Breaking News
Kukatpally

Kukatpally” కాలి మ‌ట్టెలు, ప‌ట్టీల కోసం మ‌హిళను చంపిన మ‌రో మ‌హిళ..

Kukatpally”స‌మాజంలో దారుణ హ‌త్య‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. కాలిమ‌ట్టెలు, పట్టీల కోసం ఓ మ‌హిళ‌ను దారుణంగా హ‌త్య చేసి దాన్ని హ‌త్యాచార ఘ‌ట‌న చిత్రీక‌రించిందో మ‌హిళ‌. నిజామాబాద్ కు చెందిన ప్రియాంక (23) అనే మ‌హిళ ఒంటిరిగా హైద‌రాబాద్‌లోని కేపీహెచ్‌బీలో రాత్రిళ్లు ఫుట్‌పాత్‌ల‌పై ప‌డుకుంటు ఉంటుంది. ఈ క్ర‌మంలో ప్రియాంక‌కు మంజుల అనే మ‌రో మ‌హిళతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ ప‌రిచ‌యంతో ప్రియాంక త‌న వ‌ద్ద ఉన్న వెండి ఆభ‌ర‌ణాకు భ‌ద్ర‌త లేద‌ని మంజుల వద్ద భ‌ద్ర‌ప‌రిచింది. కొన్ని రోజుల త‌ర్వాత త‌న ఆభ‌రణాలు త‌న‌కు ఇవ్వాల‌ని మంజుల‌ను ప్రియాంక అడిగింది. కానీ మంజుల తిరిగి ఆభ‌ర‌ణాలు ఇచ్చేందుకు నిరాక‌క‌రించింది. దీంతో ప్రియాంక ఆభ‌ర‌ణాలు ఇవ్వ‌క‌పోతే అంతు చూస్తాన‌ని బెదిరించింది. భ‌య‌ప‌డిన మంజుల ప్రియాంకతో త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని భావించింది. ఈ నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 30న మంజుల ప్రియాంక‌కు మ‌ద్యం తాగించి కుక‌ట్‌ప‌ల్లిలోని నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి బ్లేడ్ తో గొంతుకోసి హ‌త్య చేసింది. పోలీసుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప్రియాంక బ‌ట్ట‌లు తీసి శ‌రీరంపై బ్లేడుతో గాట్లు పెట్టి అత్యాచారం చేసి హ‌త్య చేసినట్టుగా చిత్రీక‌రించింది. అనంత‌రం అక్క‌డి నుంచి ప‌రార‌య్యింది. మృత‌దేహం ఉంద‌ని స‌మాచారం అంద‌డంతో పోలీసులు ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలయిన మంజుల‌ను అరెస్టు చేశారు.

మ‌రిన్ని క‌థ‌నాల కోసం ఈలింక్ ను క్లిక్ చేయండి.. https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Noise Buds” నోయిస్ కొత్తగా లాంచ్ చేయబడిన బడ్స్ కేవ‌లం రూ.1799కే

Duck viral video”తల్లి ప్రేమ అంటే తెగింపే.. బిడ్డ‌కోసం బాతు చేసిన ప‌ని.. వీడియో..

Iron Box” ఫిలీప్స్‌ స్టీమ్ ఐర‌న్ బాక్స్‌ కేవ‌లం రూ. 1,199కే.. 33 శాతం త‌గ్గింపుతో..

Video Viral”క‌ర్మ అనుభ‌వించాల్సిందే.. ఆక‌తాయిల‌కు బుద్ది చెప్పిన దున్న‌పోతు.. వీడియో వైర‌ల్

Boat Smart Watches” బోట్ స్మార్ట్ వాచ్‌ల‌పై 76 శాతం త‌గ్గింపు.. రూ. 3299కే అందుకోండి..

Fake Call” కూతురు వ్య‌భిచారం చేస్తుంద‌ని స్కామ‌ర్ ఫోన్.. ఆగిన త‌ల్లి మహిళ గుండె

 

About Dc Telugu

Check Also

06.11.2024 D.C Telugu sports

06.11.2024 D.C Telugu

06.11.2024 D.C Telugu Cinema

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com