Sunday , 8 September 2024
Breaking News

సంక్రాంతి బ‌రిలో అగ్ర‌హీరోలు…

చాలారోజుల తర్వాత సీనియర్‌ హీరోలు అయిన వెంకటేశ్‌, నాగార్జున.. సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్నారు. ఇక వీరితో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా యాడ్‌ అయ్యారు. వీరితో పాటు కంటెంట్‌ను నమ్మి బరిలోకి దిగుతామంటూ యంగ్‌ టాలెంట్‌ తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కూడా సిద్ధమయ్యారు. ఇక సంక్రాంతి రేసులో నిలబడిన తెలుగు సినిమాలకే థియేటర్లు దొరకక ఇబ్బందులు పడుతుంటే.. ఒక తమిళ డబ్బింగ్‌ చిత్రం కూడా పోటీకి సిద్ధమయ్యింది. ముందుగా సంక్రాంతి బరిలో దిగనున్న అన్ని సిని మాల్లో ‘గుంటూరు కారంకే ఎక్కువగా హైప్‌ క్రియేట్‌ అయ్యింది. టాలీవుడ్‌లో మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌కు ఒక రేంజ్‌లో క్రేజ్‌ ఉంది. ఇప్పటివరకు వీరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు రాగా.. హ్యాట్రిక్‌ చిత్రంగా తెరకెక్కింది ‘గుంటూరు కారం’. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాలో మహేశ్‌ బాబుకు జోడీగా శ్రీలీల నటించింది. సెకండ్‌ హీరోయిన్‌గా విూనాక్షి చౌదరి నటించింది. ప్రకాశ్‌ రాజ్‌, ఈశ్వరి రావ్‌, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ‘గుంటూరు కారం’కు తమన్‌ అందించిన మ్యూజిక్‌.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. గుంటూరు కారం’తో పోటీ అయినా పరవాలేదని, తమ కంటెంట్‌ విూద తమకు నమ్మకంతో ఉందని అదే రోజు విడుదలకు సిద్ధమయ్యారు ‘హనుమాన్‌’ మేకర్స్‌. తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ కేవలం తెలుగులోనే కాకుండా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల అవ్వనుంది. తెలుగులో మొదటి సూపర్‌ హీరో సినిమాగా తెరకెక్కిన ‘హనుమాన్‌’.. ‘గుంటూరు కారం’కు పోటీగా థియేటర్లను దక్కించుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అమృతా అయ్యర్‌, వరలకిë శరత్‌కుమార్‌, వినరు రారు.. ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 12న పోటీలో నలిగిపోకూడదనే ఉద్దేశ్యంతో జనవరి 13న తన సినిమా ‘సైంధవ్‌’ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

 

పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం..

వెంకటేశ్‌. తన కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కిన ‘సైంధవ్‌’ను ‘హిట్‌’ ఫ్రాంచైజ్‌ ఫేమ్‌ శైలేష్‌ కొలను డైరెక్ట్‌ చేశాడు. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ ట్రైలర్‌ చూస్తుంటే సినిమాలో సెంటిమెంట్‌తో పాటు వయొలెన్స్‌, యాక్షన్‌ కూడా ఉండనుందని అర్థమవుతోంది. ఇక ‘సైంధవ్‌’లో వెంకీ మామకు జోడీగా శ్రద్దా శ్రీనాథ్‌ నటించగా.. బేబీ సారా కీలక పాత్రలో కనిపించనుంది. ఆండ్రియా, ఆర్య, నవాజుద్దీన్‌ సిద్ధికీ.. ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకటేశ్‌తో పాటు మరో సీనియర్‌ హీరో నాగార్జున కూడా ఈసారి సంక్రాంతిలో పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. విజరు బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగ్‌ నటించిన చిత్రమే ‘నా సామిరంగ’. ఈ మూవీ జనవరి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. నాగార్జునతో పాటు అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌లు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు. అషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. కీరవాణి అందించిన మ్యూజిక్‌.. విలేజ్‌ ఫీల్‌ ఇస్తుందని విడుదలయిన పాటలు విన్న ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇక జనవరి 12న రెండు తెలుగు చిత్రాలకు పోటీగా ఒక తమిళ చిత్రం కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యింది. అదే శివకార్తికేయన్‌ హీరోగా నటించిన ‘అయాలన్‌’. ఈ మూవీ ఎంతోకాలంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌లోనే ఆగిపోయింది.

ఆర్టీసీ లో ఉచిత ప్ర‌యాణానికి ఇది త‌ప్ప‌నిస‌రి… లేకుంటే 500 ఫైన్‌.. ఆర్టీసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

ల‌క్ష్మినైల్‌గా రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యి.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసింది. వీటితో పాటు ధనుష్‌ నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ కూడా జనవరి 12న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ తెలుగులో భారీ పోటీ ఉండడం వల్ల కేవలం తమిళనాడులో మాత్రమే విడుదల అవుతున్నట్టు సమాచారం.

About Dc Telugu

Check Also

Scooty Viral Video

Scooty Viral Video” లాంగ్ స్కూటీ.. కారులెక్క న‌లుగురు కూర్చోవ‌చ్చు… వీడియో వైర‌ల్

Scooty Viral Video”  కుటుంబ స‌భ్యులు కానీ.. ఫ్రెండ్స్ కానీ ముగ్గురు న‌లుగురు ఒకే వాహ‌నంలోపోవాలంటే క‌చ్చితంగా కారు కావాల్సిందే. …

Amazon Offers

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాల‌న్న‌ది అంద‌రి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్క‌ల‌ను పెంచుకుంటురు. అందుకోస‌మే …

Viral Video

Viral Video” కండ్లు చెదిరే రియ‌ల్ చేజింగ్‌.. సినిమాల్లో కాదు.. వీడియో వైర‌ల్

Viral Video” ముందు విల‌న్ వెన‌కాలే హీరో చేజింగ్ న‌డుస్తుంటే కండ్లు ప‌క్క‌కు తిప్ప‌కుండా టెన్ష‌న్ ప‌డ‌కుండా చూస్తాం. ఇదీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com