నేడు గుంటూరుకారం ప్రీ రిలీజ్‌ వేడుకలు

గత రెండ్రోజులుగా నిరుత్సాహంలో ఉన్న మహేష్‌ అభిమానులకు ‘గుంటూరు కారం’మేకర్స్‌ శుభవార్త చెప్పారు. ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రీ రిలీజ్‌ వేడుక ఆరో తేదీన హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. కానీ పోలీస్‌ అనుమతులు, సెక్యూరిటీ కారణాల వల్ల వాయిదా పడింది. మరో రోజు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి దక్కలేదు. దాంతో ఇప్పుడీ భారీ ఈవెంట్‌ గుంటూరులో చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. మంగళవారం గుంటూరు, నంబూరు క్రాస్‌ రోడ్స్‌ సవిూపంలోని బహిరంగ ప్రాంగణంలో ఈ వేడుక నిర్వహించనున్నారు.

సంక్రాంతి బ‌రిలో అగ్ర‌హీరోలు…

రెండ్రోజుల క్రితం జరగాల్సిన ఈవెంట్‌ పోస్ట్‌పోన కావడంతో నిరుత్సాహపడిన అభిమానుల్లో ఈ వార్తతో ఉత్సహం రెట్టింపు అయింది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల, విూనాక్షి చౌదరి నాయికలు. ప్రకాష్‌ రాజ్‌ , జగపతిబాబు, రమ్యకృష్ణ, ఈశ్వరీరావు కీలక పాత్రధారులు. తమన్‌ సంగీతం అందించారు. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించారు. సోమవారం విడుదలైన ట్రైలర్‌ సోషల్‌ విూడియాలో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే!

 

పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *