ఆదివారం (డిసెంబర్ 3)నాడు తెలంగాణ శాసన సభ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సర్వేలు కాంగ్రెస్‌దే అధికారం తేల్చేశాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం మొదలయ్యింది. ఈ నేపథ్యంలోటీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలని ట్వీటర్ వేదికగా పంచుకున్నారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని రాసుకొచ్చారు. మీ కష్టం, మీ శ్రమ వృథా కాలేదు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో మీ అందరి పాత్ర మరువలేనిది. ప్రతి ఒక్కరికి అభినందనలని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ధన్యవాదాలు..
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.
గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు వెరవకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో మీరంతా… pic.twitter.com/4VPl4X5uCW
— Revanth Reddy (@revanth_anumula) December 1, 2023
ప్రశాతంగా నిద్రపోయాను.. కేటీఆర్ ట్వీట్
రైళ్లో పెండ్లి… పూలు అందించి ఆశీర్వదించిన తోటి ప్రయాణికులు.. వీడియోమ వైరల్
మూడు రాష్ట్రాల్లో హస్తమే.. ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
స్వాతంత్య్రం వచ్చిన తరువాత విదేశీ పర్యటకు వెళ్లిన తొలి టీం ఇదే..