రైళ్లో పెండ్లి… పూలు అందించి ఆశీర్వ‌దించిన తోటి ప్ర‌యాణికులు.. వీడియోమ వైర‌ల్

పెండ్లి అంటే సాధార‌ణంగా బంధువులు, స్నేహితులు మ‌ధ్య కోలాహ‌లంగా జరుగుతాయి. ప్రేమ పెండ్లిళ్లు అయితే త‌మ దైవ స‌న్నిధిలోనే, రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల్లో జ‌రుగుతాయి. కానీ ఈ వీడియోలో క‌దులుతున్న రైల్లో జ‌రిగింది. ప‌శ్చిమ బెంగాల్‌లోని ఓ రైల్వే స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. రైల్లో ప్ర‌యాణిస్తున్న యువ‌తి యువ‌కులు ప‌క్క‌న ప‌క్క‌న ఉండి ఏదో మాట్లాడుకుంటారు. ఆ త‌రువాత యువ‌తిని సీట్లో కూర్చుండబెట్టి ఆమె మెడ‌లో తాళి లాంటి ఒక హారాన్ని క‌డుతాడు. ఆ త‌రువాత యువ‌తి ప‌క్క‌న కూర్చున్న మ‌హిళ సంచిలో నుంచి దండ‌లు అంద‌జేస్తుంది. దీంతో ఒక‌రినొక‌రు దండ‌లు మార్చుకుంటారు. తోటి ప్ర‌యాణికులంద‌రూ ఆశీర్వ‌దించి సంతోషం వ్య‌క్తం చేస్తారు. కొంత మంది ఈ స‌న్నివేశాన్ని త‌మ‌తమ ఫోన్ల‌లో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. కింద ఉన్న‌ఈవీడియోను.. మీరు చూడండి

 

View this post on Instagram

 

A post shared by Yadav Max Sudama (@max_sudama_1999)

 

మూడు రాష్ట్రాల్లో హ‌స్త‌మే.. ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి

ఏడుస్తూ అత్తారింటికి వెళ్తున్న న‌వ వధువు.. ఒక్క‌సారిగా.. వీడియో వైర‌ల్

స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత విదేశీ ప‌ర్య‌ట‌కు వెళ్లిన తొలి టీం ఇదే..

అమ్మ‌డానికి, వ‌దిలేయ‌లేని ఏనుగును ఏం చేస్తావ్‌.. ఇంటర్య్వూలో వింత ప్ర‌శ్న

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *