Shankarapatnam Cpi”
శంకరపట్నం, డిసి ప్రతినిధి:
విద్యుత్తు కొరతపై పోరాటం చేస్తూ అమరులైన వీరులకు ఘన నివాళి అర్పించినట్లు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య తెలిపారు.
గురువారం శంకరపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2000 ఆగస్టు 28న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో, విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా హైదరాబాద్ పట్టణంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్నవారిపై జరిగిన పోలీసు కాల్పుల్లో విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణలు అమరులైనారని గుర్తుచేశారు.
ఈ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆమరుల కుటుంబాలకు ఆ సమయంలో ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేసిన సమ్మయ్య, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ప్రభుత్వాలు వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి, బిల్లింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిలర్ రేగుల కుమార్, కోశాధికారి గోదారి లక్ష్మణ్, పార్టీ నాయకులు బూర్తుల శ్రీనివాస్, పిట్టల రామస్వామి, మార్కొండ నరసయ్య, సురేష్ కుమార్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Camate Arc 2K WiFi స్మార్ట్ సీసీటీవీ కెమేరా
️ Weatherproof | Colored Night Vision | ️ 2-Way Audio
బల్బ్ షేప్‌లో అదిరే సెక్యూరిటీ కెమేరా!
మొబైల్‌లో ఎక్కడినుంచైనా లైవ్ వీక్షణ!
ఫ్యామిలీతో కెమేరా షేర్ చేసుకోండి
iOS, Android, Windowsకు సపోర్ట్
360° వ్యూ — నో బ్లైండ్ స్పాట్స్
మోషన్ డిటెక్షన్ & లైవ్ అలర్ట్స్
కెమేరా వెంటనే మాట్లాడే Two-Way ఆడియో
256GB SD కార్డ్ సపోర్ట్ — ఎక్కువ రికార్డింగ్
ఇప్పుడే ఆఫర్ ధర: ₹2,599 (48% OFF)
ఇంటికి డెలివరీ, సులభమైన ఇన్‌స్టాలేషన్
కొనాలి అంటే https://amzn.to/3HXnGE6 లింక్ పై క్లిక్ చేయండి..
